News March 19, 2025
కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్‌గా నందకుమార్

కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్సెలర్‌గా డా.పీవీ నంద కుమార్ రెడ్డి బుధవారం అధికారికంగా తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ ప్రతిష్టను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం వర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించి యూనివర్సిటీ సిబ్బందితో ముచ్చటించారు.
Similar News
News September 13, 2025
వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

వరంగల్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, మొత్తం జిల్లా వ్యాప్తంగా 18.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. వీటిలో ఎక్కువ వర్షం నెక్కొండ మండలంలో 14.9 మి.మీగా నమోదు కాగా, పర్వతగిరిలో 2.7 మి.మీ, రాయపర్తిలో 0.5 మి.మీ వర్షం కురిసింది.
News September 13, 2025
ఆమిర్ ఖాన్ తనయుడి సినిమాలో సాయిపల్లవి

సౌత్ హీరోయిన్ సాయిపల్లవి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తున్నారు. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తొలుత ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌ను అనుకున్నారు. తాజాగా దానిని ‘మేరే రహో’గా మార్చారు. ఈ మూవీని నవంబర్ 7న రిలీజ్ చేయాల్సి ఉండగా డిసెంబర్ 12కు వాయిదా వేశారు. ఇది సాయిపల్లవికి హిందీలో డెబ్యూ మూవీ కానుంది. ఆమె రణ్‌బీర్ ‘రామాయణ’ మూవీలోనూ నటిస్తున్నారు.
News September 13, 2025
NGKL: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఈగలపెంట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సల్వాది బాలయ్య గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలయ్య అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వ్యక్తి. అచ్చంపేట, సిద్దాపూర్, ఆమనగల్, మహబూబ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలయ్య మృతి పట్ల తోటి పోలీసు సిబ్బంది సంతాపాన్ని వ్యక్తం చేశారు.