News March 19, 2025

టిక్‌టాక్ రీల్ అనుకరిస్తూ కోమాలోకి బాలిక

image

టిక్‌టాక్ రీల్ అనుకరిస్తూ ఓ బాలిక కోమాలోకి వెళ్లింది. USలోని మిస్సోరి ఫెస్టస్‌కు చెందిన స్కార్లెట్ సెల్బీ(7) టిక్‌టాక్‌లో నీడో క్యూబ్‌ ఆకృతిని మార్చే రీల్ చూసింది. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని రీల్‌లో చూపించినట్లు ఆ క్యూబ్‌ను తొలుత ఫ్రీజ్ చేసి ఆపై ఒవెన్‌లో ఉంచింది. దానిని బయటికి తీసినప్పుడు క్యూబ్‌ పేలి, అందులోని వేడి ద్రవం ఆమె ముఖం, ఛాతిపై పడింది. కొంత నోరు, ముక్కులోకి చేరడంతో కోమాలోకి వెళ్లింది.

Similar News

News March 20, 2025

ఈ పురస్కారంతో ఆయన కీర్తి మరింత పెరిగింది: పవన్

image

UK పార్లమెంట్ అందించిన జీవిత సాఫల్య పురస్కారంతో అన్నయ్య చిరంజీవి కీర్తి మరింత పెరిగిందని AP DyCM పవన్ పేర్కొన్నారు. ‘మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో కళామతల్లి దీవెనలతో ఆయన చిత్ర రంగంలో మెగాస్టార్‌గా ఎదిగారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్విస్తున్నా. నేను ఆయనను అన్నయ్యగా కాకుండా తండ్రి సమానుడిగా భావిస్తా. నాకు మార్గం చూపిన వ్యక్తి ఆయన’ అని ట్వీట్ చేశారు.

News March 20, 2025

యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి

image

TG: సూర్యాపేట (D) హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూర్‌నగర్‌కు చెందిన రోజా తన స్నేహితురాలి(26)ని ఇంటికి పిలిచింది. ఆపై మద్యం తాగించి మత్తులోకి వెళ్లాక రోజా ప్రియుడు ప్రమోద్ ఆ యువతిపై అత్యాచారం చేయగా ఆమె వీడియో తీసింది. బుధవారం మరోసారి ఆ యువతికి ఫోన్ చేసి పిలిపించారు. ఈ సారి తన ఫ్రెండ్ హరీశ్ కోరిక తీర్చాలని ప్రమోద్ కోరగా ఆమె నిరాకరించి పోలీసులను ఆశ్రయించారు.

News March 20, 2025

‘కోర్టు’ కలెక్షన్లలో తగ్గేదేలే..

image

‘కోర్టు’ మూవీ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.36.85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల తీర్పుతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించారు.

error: Content is protected !!