News March 19, 2025
వేగవంతంగా కమర్షియల్ ట్రేడ్ వసూలు చేయండి: బల్దియా కమిషనర్

కమర్షియల్ ట్రేడ్ వేగవంతంగా వసూలు చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజారోగ్య విభాగ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు. ప్రతి రోజు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న కమర్షియల్ షాపుపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.
Similar News
News October 30, 2025
ట్రైనింగ్ ప్రోగ్రాం సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ జితేష్

ఫర్నిచర్ అసిస్టెంట్ 3 నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఉపాధి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా యువతకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. నవంబర్ 6న కలెక్టరేట్లో డ్రాయింగ్‌పై టెస్ట్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువత ఫర్నిచర్ ప్రొడక్షన్, ఇన్స్టలేషన్, మెషిన్ ఆపరేషన్ రంగాల్లో నైపుణ్యం సాధించి స్థిరమైన ఉద్యోగ అవకాశాలు పొందగలరని ఆయన చెప్పారు.
News October 30, 2025
కల్తీ నెయ్యి సరఫరాలో భారీ కుట్ర: సిట్

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని సిట్ తేల్చింది. ఈ అక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు <<16598439>>చిన్నఅప్పన్న<<>>కు భారీగా కమీషన్ ముట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆయన అరెస్టుతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం భోలేబాబా డెయిరీని తప్పించి ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకునేలా చేశారని తేలింది.
News October 30, 2025
జనగామ కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లకు కంట్రోల్ రూమ్

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను పరిష్కరించడానికి జనగామ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ రిజ్వాన్ బాషా రిబ్బన్ కట్ చేసి కంట్రోల్ రూమ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో ఎలాంటి సమస్యలు ఉన్నా 8520991823ను సంప్రదించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


