News March 19, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤హత్తిబెళగల్ వీఆర్వోపై కర్నూలు జేసీ నవ్య ఆగ్రహం ➤ కూటమి ప్రభుత్వంపై ఆలూరు ఎమ్మెల్యే ఫైర్ ➤ జగన్, కేసీఆర్ తోడు దొంగలు, ఆర్థిక నేరగాళ్లు: బైరెడ్డి ➤ లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..! ➤ కోడుమూరు: వైసీపీ నాయకుడి మృతి ➤ ప్రజల మనసులో నుంచి వైఎస్ఆర్‌ను తొలగించలేరు: ఎస్వీ ➤ ప్రభుత్వాసుపత్రిలో అన్ని వైద్య సేవలు అందించాలి: ఆదోని ఎమ్మెల్యే
Similar News
News January 11, 2026
సజ్జల తీరుతోనే జగన్‌కు 151 నుంచి 11 సీట్లు: ఎమ్మెల్సీ బీటీ

కనీసం వార్డు మెంబర్‌గా గెలవని సజ్జల రామకృష్ణారెడ్డి చట్టసభలు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడటం విడ్డూరమని ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సజ్జల అనాలోచిత సలహాల వల్లే జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని విమర్శించారు. సలహాదారుగా ఉండి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం సొంత పార్టీ నేతలే ఆయనను తిరస్కరిస్తున్నారని తెలిపారు.
News January 11, 2026
సీఎం యాప్‌లో నమోదుతోనే కందుల కొనుగోలు

రైతు సేవా కేంద్రాల ద్వారా సీఎం యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే కందుల విక్రయాలు చేపట్టాలని కర్నూలు జిల్లా వ్యవసాయాధికారిని వరలక్ష్మి శనివారం తెలిపారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.8 వేల మద్దతు ధర నిర్ణయించిందని పేర్కొన్నారు. కందులలో తేమ శాతం 12 లోపు ఉండాలని సూచించారు. ఇప్పటివరకు 5,379 మంది రైతులు యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
News January 10, 2026
టీచర్‌గా మారిన కర్నూలు కలెక్టర్

కల్లూరు మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి టీచర్‌గా మారారు. మండల పరిధిలోని పందిపాడులో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె శనివారం తనిఖీ చేశారు. పిల్లలతో కూర్చుని ప్రీ స్కూల్ విద్యలో వారి సామర్థ్యాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం కలెక్టర్ చేయడంతో చిన్నారులు మంత్రముగ్ధులు అయ్యారు.


