News March 20, 2025
మెదక్: పారదర్శక పాలనే లక్ష్యం: కలెక్టర్

పారదర్శక రెవిన్యూ పాలనే లక్ష్యంగా సంబంధిత తహశీల్దార్లు జవాబు దారితనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు అన్ని మండలాల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరిండెంటెంట్లు, ఇతర రెవెన్యూ సిబ్బందితో కలిసి పెండింగ్ ప్రజావాణి సమస్యలు, ధరణి సమస్యలపై సమీక్షించారు.
Similar News
News July 8, 2025
రెవెన్యూ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలి: మెదక్ కలెక్టర్

రెవెన్యూ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కొల్చారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. రికార్డుల భద్రత క్రమ పద్ధతిలో ఉండాలన్నారు. ప్రజా సమస్యలపై జవాబుదారితనం అవసరమన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో తీసుకున్న దరఖాస్తుల రిజిస్ట్రేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
News July 8, 2025
మెదక్: రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

మెదక్ ఆర్టీసీ డిపోలో మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ సోమవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రేపు ఉ.11 గంటల నుంచి మ.12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు తమ సందేహాల నివృత్తికి 7842651592 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.
News July 8, 2025
మెదక్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.