News March 24, 2024
నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే ఊరుకోను: సంతోష్

TG: ఫోర్జరీ కేసుపై మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ స్పందించారు. షేక్‌పేటలో స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఫోర్జరీ అనేది అవాస్తవమన్నారు. న్యాయపరమైన సమస్య ఉంటే లీగల్ నోటీసులు ఇవ్వాలి గానీ, పీఎస్‌లో ఫోర్జరీ కేసు పెట్టడం సరికాదన్నారు. రాజకీయ కక్షతోనే తనపై బురద జల్లాలని చూస్తున్నారని, తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే ఊరుకోనని సంతోష్ హెచ్చరించారు.
Similar News
News November 9, 2025
ఒలింపిక్స్ 2028: IND vs PAK మ్యాచ్ లేనట్లే!

2028 నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానున్న సంగతి తెలిసిందే. అయితే మెగా టోర్నీలు అనగానే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండాల్సిందే. కానీ ఈ ఈవెంట్‌లో ఇరు జట్లు తలపడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కడం కష్టంగా మారడమే దీనికి కారణం. ఒక్కో ఖండం నుంచి ఒక్కో <<18233382>>జట్టును<<>> ఎంపిక చేయాలని ఐసీసీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
News November 9, 2025
కొలికపూడిపై చర్యలు తీసుకోవాలి.. CBNకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక

AP: ఎంపీ చిన్నితో వివాదంలో తప్పంతా MLA కొలికపూడిదేనంటూ TDP క్రమశిక్షణ కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ఎన్నికైనప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. తన ఆరోపణలపై కొలికపూడి ఒక్క ఆధారం సమర్పించలేదని, సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలని సీఎంకు విన్నవించినట్లు సమాచారం. అయితే వారిద్దరినీ పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కమిటీకి CBN చెప్పారు.
News November 9, 2025
పాడి పశువుల పాలలో కొవ్వు శాతం ఎందుకు తగ్గుతుంది?

గేదె, ఆవు పాలకు మంచి ధర రావాలంటే వాటిలో కొవ్వు శాతం కీలకం. పశువుల వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈత చివరి దశలో సాధారణంగానే పాలలో కొవ్వు శాతం తగ్గుతుంది. పశువులను మరీ ఎక్కువ దూరం నడిపించినా, అవి ఎదలో ఉన్నా, వ్యాధులకు గురైనా, మేతను మార్చినప్పుడు, పచ్చి, ఎండుగడ్డిని సమానంగా ఇవ్వకున్నా పాలలో వెన్నశాతం అనుకున్నంత రాదు.✍️ వెన్నశాతం పెంచే సూచనలకు <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.


