News March 20, 2025
ADB: 144 సెక్షన్ అమలు.. ఈ దుకాణాలు బంద్: SP

ADB జిల్లాలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్(144సెక్షన్) అమల్లో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. మైకులకు, డీజేలతో, ఊరేగింపులకు, ధర్నాలకు, ప్రచారాలకు అనుమతులు లేవని తెలిపారు. పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ దుకాణాలను మూసివేసి ఉంచాలని ఆదేశించారు.
Similar News
News March 21, 2025
ADB: ACB కేసులో తప్పుడు సాక్ష్యం.. ముగ్గురిపై కేసు

కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ముగ్గురి పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ ACB స్పెషల్ కోర్టు జడ్జీ తీర్పునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 2010లో లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) రేగుంట స్వామి కేసులో ఇచ్చోడ మండలానికి చెందిన కన్నమయ్య, నారాయణ, మల్లయ్య తప్పుడు సాక్ష్యం చెప్పారు. దీంతో వారిపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది.
News March 21, 2025
ADB: BC స్టడీ సర్కిల్ ఘనత.. గ్రూప్స్‌లో సత్తాచాటిన 25 మంది

ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్స్ ఫలితాల్లోమంచి మార్కులు సాధించిన వారిని అభినందించారు. గ్రూప్-1 లో ఏడుగురు, గ్రూప్ 2లో 15 మంది, గ్రూప్-3 లో ఐదుగురు మంచి మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జూనియర్ లెక్చరర్లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు.
News March 21, 2025
నార్నూర్ వాసికి CM ద్వారా నియామకపత్రం

నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ సూరజ్ సింగ్-ప్రణీత దంపతుల కుమారుడు బానోత్ సోను సింగ్ ఇటీవల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఉద్యోగ నియామకపత్రాన్ని అందజేసి అభినందించారు. కార్యక్రమంలో వేణుగోపాల్, బంజారా నాయకులు పాల్గొన్నారు.