News March 20, 2025

NZB: జిల్లా బాలికలకు ఫుట్బాల్ ఛాంపియన్షిప్

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా బాలికల జట్టు ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో భాగంగా వనపర్తి జిల్లాలో జరిగిన అండర్ 14 బాలికల రాష్ట్రస్థాయి పోటీల్లో ఫైనల్ మ్యాచ్‌లో నిజామాబాద్, ఆదిలాబాద్ జట్లు తలపడ్డాయి. ఇందులో జిల్లా జట్టు 2-0 గోల్ తేడాతో విజయం సాధించింది.

Similar News

News March 21, 2025

నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

నిజమాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. శుక్రవారం కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం లభించినపట్టికీ పంటలకు నష్టం జరిగే అవకాశం ఉండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

News March 21, 2025

NZB: ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

image

ఇంటర్​ పరీక్షల మూల్యాంకనం ప్రారంభమైనట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఇప్పటికే సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం​ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ నెల 22న మొదటి దశ (ఇంగ్లిష్​, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్), 24 నుంచి రెండో దశ (ఫిజిక్స్, ఎకనామిక్స్), 26 నుంచి మూడో స్పెల్ (కెమిస్ట్రీ, కామర్స్), 28వ తేదీ నుంచి నాలుగో స్పెల్ (హిస్టరీ, బోటనీ, జువాలజీ) మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలిపారు.

News March 20, 2025

NZB: చివరి రోజు 438 ఆబ్సెంట్

image

జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు 22వ తేదీన నిర్వహించనున్నట్లు DIEO రవికుమార్ తెలిపారు. గురువారం రెండో సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించారు. 438 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 15,896 మంది విద్యార్థులకు 15,458 మంది పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. మొత్తం 97.2% విద్యార్థులు పరీక్షలు రాశారు.

error: Content is protected !!