News March 20, 2025
బాపట్ల: రూ.149 కోట్ల పనులు మంజూరు

జలజీవన్ మిషన్ద కింద జిల్లాకు రూ.149 కోట్లతో 337 పనులు మంజూరు అయ్యాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు. బుధవారం బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 9, 2025
ఖమ్మం: చికెన్ ధరలు.. కేజీపై రూ.30 వరకు తగ్గింపు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత వారంతో పోలిస్తే కిలో చికెన్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు ధరలు తగ్గాయని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం లైవ్ చికెన్ కేజీ ధర రూ.150-180గా, స్కిన్ చికెన్ రూ.180-200గా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.210-240 మధ్య పలుకుతోంది. కొనుగోలుదారులు తగ్గిన ధరలపై సంతోషం వ్యక్తం చేశారు.
News November 9, 2025
కామారెడ్డిలో మటన్, చికెన్ ధరల వివరాలు ఇలా..!

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800 కాగా, చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.250, లైవ్ కోడి కిలో రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. కార్తీక మాసం కావడంతో మాంసం విక్రయాలు తగ్గుముఖం పట్టాయని విక్రయదారులు చెప్పారు.
News November 9, 2025
కొలికపూడిపై చర్యలు తీసుకోవాలి.. CBNకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక

AP: ఎంపీ చిన్నితో వివాదంలో తప్పంతా MLA కొలికపూడిదేనంటూ TDP క్రమశిక్షణ కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ఎన్నికైనప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. తన ఆరోపణలపై కొలికపూడి ఒక్క ఆధారం సమర్పించలేదని, సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలని సీఎంకు విన్నవించినట్లు సమాచారం. అయితే వారిద్దరినీ పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కమిటీకి CBN చెప్పారు.


