News March 20, 2025

మహబూబ్‌నగర్: 144 సెక్షన్ అమలు: ఎస్పీ 

image

మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో కేంద్రాల వద్ద మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్-2023 (144 సెక్షన్) అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి బుధవారం తెలిపారు. 12,769 మంది విద్యార్థులకు 60 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు.

Similar News

News March 20, 2025

మహబూబ్‌నగర్: బైపాస్ రోడ్డు నిర్మించాలని కేంద్ర మంత్రికి వినతి 

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డును నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా & రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో గురువారం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.

News March 20, 2025

MBNR: ‘వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

image

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వడదెబ్బ బాధితులకు తక్షణమే తగిన చికిత్స అందించాలని MBNR కలెక్టర్ విజయేంద్రబోయి వైద్యసిబ్బందిని ఆదేశించారు. జానంపేట PHCని  ఆకస్మిక తనిఖీచేశారు. అన్ని విభాగాలు, రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 20, 2025

ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం పెరగాలి: కలెక్టర్

image

మూసాపేట మండలం జానంపేట ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులదలో అన్ని రకాల వైద్య సేవలు ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా నడుచుకోవాలని సూచించారు.

error: Content is protected !!