News March 24, 2024

సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ భారీ స్కోర్

image

లక్నోతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 193 రన్స్ చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ 82* రన్స్‌తో రాణించారు. రియాన్ 43, జైస్వాల్ 24, జురెల్ 20* చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ 2, మోసిన్ ఖాన్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు. లక్నో విజయానికి 20 ఓవర్లలో 194 రన్స్ అవసరం.

Similar News

News November 8, 2025

ఆసీస్‌తో అయిపోయింది.. సౌతాఫ్రికాతో మొదలవుతుంది

image

ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా టూర్ నేటితో ముగిసింది. రేపు ఆటగాళ్లు స్వదేశానికి రానున్నారు. ఈనెల 14(కోల్‌కతా) నుంచి సౌతాఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. 22న(గువాహటి)లో సెకండ్ టెస్ట్ జరగనుంది. తర్వాత 3 వన్డేల సిరీస్ మొదలవుతుంది. 30న తొలి, DEC 3న రెండో, 6న మూడో వన్డే ఆడతారు. అనంతరం 5 టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. 9న తొలి, 11న రెండో, 14న మూడో, 17న నాలుగో, 19న ఐదో టీ20 జరుగుతుంది.

News November 8, 2025

కొత్తగా CDF పోస్టు… పాక్ ఆర్మీలో కీలక మార్పు!

image

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ రక్షణ వ్యవహారాల్లో పలు మార్పులు వస్తున్నాయి. భారత CDS మాదిరిగా కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF) పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుల బాధ్యత అప్పగిస్తారని ‘GEONEWS’ పేర్కొంది. సైన్యంపై అధికారం అధ్యక్షుడు, ప్రభుత్వానికి కాకుండా CDFకు ఉంటుందని తెలిపింది. త్వరలో రిటైర్ కానున్న ఆర్మీ చీఫ్ మునీర్‌ రేసులో ఉన్నారని వెల్లడించింది.

News November 8, 2025

బండి సంజయ్ హాట్ కామెంట్స్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇది హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్. మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు, బొట్టు పెట్టుకున్నోళ్లకు, పెట్టుకోనోళ్లకు మధ్య పోటీ. 80% ఉన్న హిందువులు గెలుస్తారా? 20% ఉన్న ముస్లింలా? హిందువుల పక్షాన BJP, ముస్లింల వైపు INC ఉంది. TGని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.