News March 20, 2025

కర్నూలు: ఈవీఎం వేర్ హౌస్‌ను పరిశీలించిన కలెక్టర్

image

త్రైమాసిక తనిఖీలో భాగంగా ఈవీఎంలు భద్రపరచిన వేర్ హౌస్‌ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ ఆవరణలోని ఈవిఎం వేర్ హౌస్‌లో ఈవీఎంలను భద్రపరచిన తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఈవీఎంలను భద్రతపై నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News March 20, 2025

ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంత నిరసన

image

ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంత గురువారం నిరసన చేపట్టారు. పట్టణంలోని కోట్ల విగ్రహం వద్ద నిరాహార దీక్షకు పూనుక్కున్నారు. ఏ తప్పు చేయకున్నా అవిశ్వాస తీర్మానం పెట్టాలని కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం తగదన్నారు. నాలుగేళ్ల పాటు నిజాయితీగా ఉంటూ వైసీపీలోనే కొనసాగుతున్నన్నారు. ఆ పార్టీ కౌన్సిలర్లే పదవి దింపాలని చూడటం సమంజసం కాదని అన్నారు. న్యాయం చేయాలని మాజీ సీఎం జగన్‌ను కోరుతామని తెలిపారు.

News March 19, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤హత్తిబెళగల్ వీఆర్వోపై కర్నూలు జేసీ నవ్య ఆగ్రహం ➤ కూటమి ప్రభుత్వంపై ఆలూరు ఎమ్మెల్యే ఫైర్ ➤ జగన్, కేసీఆర్ తోడు దొంగలు, ఆర్థిక నేరగాళ్లు: బైరెడ్డి ➤ లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..! ➤ కోడుమూరు: వైసీపీ నాయకుడి మృతి ➤ ప్రజల మనసులో నుంచి వైఎస్ఆర్‌ను తొలగించలేరు: ఎస్వీ ➤ ప్రభుత్వాసుపత్రిలో అన్ని వైద్య సేవలు అందించాలి: ఆదోని ఎమ్మెల్యే

News March 19, 2025

కర్నూలు: లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..!

image

ఆస్పరి SI వెంకట నరసింహులు సస్పెన్షన్‌కు గురయ్యారు. చిత్తూరు జిల్లా సోమల పీఎస్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఘటనలో సస్పెండ్ చేశారు. 2023లో ఓ మహిళ అదృశ్యమవ్వడంతో భర్త ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆమె స్టేషన్‌కు చేరుకుని తన భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. అందుకు ఎస్ఐ రూ.లక్ష డిమాండ్ చేసి, మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టించాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.

error: Content is protected !!