News March 20, 2025
ములుగు: పది పరీక్షలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

ములుగు జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. మార్చి 21 నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో నిర్వహణ విద్యాశాఖ సిబ్బందికి కలెక్టర్ ముందస్తు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, కేంద్రం వద్ద ఇద్దరు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకు ఎలాంటి కరెంట్ కోతలు ఉండవద్దన్నారు.
Similar News
News February 27, 2026
వర్షాకాలానికి ముందే మేడిగడ్డ మరమ్మతులు

TG: మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతు చేసి వినియోగంలోకి తెస్తామని CM రేవంత్ ప్రకటించడం తెలిసిందే. ఆ దిశగా అధికారులు డిజైన్లు రెడీ చేస్తున్నారు. దాదాపు ₹500CRకు పైగా ఖర్చవుతుందని అంచనా. ఖర్చు GOVT భరించాలని L&T అంటుండగా, ఆ సంస్థే భరించాలని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. వర్షాకాలానికి ముందే APRలో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీ రిపేర్లూ చేయిస్తారు.
News February 27, 2026
ప్రభాస్ ‘స్పిరిట్’లో వివేక్ ఒబెరాయ్

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు ప్రకటించిన టీమ్.. ఆయన లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమా మార్చి 5, 2027న రిలీజ్ కానుంది. ఇందులో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
News February 27, 2026
కామారెడ్డి: సంఘటన్ సృజన్ అభియాన్‌తో సంస్థాగత బలోపేతం

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘటన్ సృజన్ అభియాన్ 7వ రోజు శిక్షణ శిబిరం విజయవంతంగా జరిగింది. రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ మైనారిటీ విభాగం ఛైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గార్హీ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ స్థాయి నిర్మాణ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహాలపై మార్గదర్శనం చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నగేశ్ రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.


