News March 20, 2025
నిబంధనలు పాటించని లారీలు సీజ్: కలెక్టర్

నిబంధనలు పాటించని రాయిలోడుతో వెళ్లే వాహనాలను సీజ్ చేస్తామని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లో అధికారులు, క్వారీ లారీల యజమానులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల క్వారీ లారీల కారణంగా ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. వీటి వల్ల రైల్వే ట్రాక్ దెబ్బతిన్నలతో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిందన్నారు.
Similar News
News March 20, 2025
కష్ణా: ‘డాక్టర్ శ్రీహరి హత్య కేసు దోషులను పట్టుకోవాలి’

కృష్ణాజిల్లా అవనిగడ్డలో డా. కే శ్రీహరి హత్య కేసు దోషులను పట్టుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో 2020వ సంవత్సరంలో వివేకానంద రెడ్డి హత్య తరహాలోనే డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా సీబీసీఐడి విచారణ చేపట్టి డాక్టర్ కోట శ్రీహరి హంతకులను పట్టుకోవాలని కోరారు.
News March 20, 2025
VJA: సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలి: కలెక్టర్

విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో గురువారం దాతలు ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి ఆర్వో ప్లాంట్, వైద్య శిబిరాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజల దాహర్తి తీర్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.
News March 20, 2025
రాష్ట్రంలో 26 సైబర్ పోలీస్ స్టేషన్లు: హోం మంత్రి

రాష్ట్రంలో కొత్తగా 26 సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధం చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో కనీసం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న 277 మంది సీఐలను డీఎస్పీలుగా ప్రమోషన్ కల్పించాల్సి ఉందన్నారు.