News March 20, 2025
గద్వాల: 144 సెక్షన్ అమలు

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163, BNSS అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 40 పరీక్ష కేంద్రాల్లో 717 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటాయని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News March 21, 2025
రానున్న 3 నెలలు జాగ్రత్త: సీఎస్ విజయానంద్

AP: రానున్న 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాలుల పట్ల రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) కె.విజయానంద్ సూచించారు. వడగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ముందు జాగ్రత్త చర్యలు ముఖ్యమన్నారు. వడదెబ్బ తాకకుండా నీటిని అధికంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ఈ మేరకు వీడియో సమావేశం ద్వారా సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
News March 21, 2025
ALERT: మన్యం జిల్లాకు వర్ష సూచన

భగ్గమంటున్న ఎండలు, ఉక్కబోతతో అల్లాడిన మన్యం జిల్లా వాసులకు APSDMA చల్లటి కబురు చెప్పింది. జిల్లాలో శనివారం వడగాలులు, ఆదివారం వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.
News March 21, 2025
టెన్త్ పరీక్షలు.. వికారాబాద్ జిల్లాలో ఆంక్షలు

వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి జరిగే టెన్త్ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోని విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పరీక్షా కేంద్రాల వద్ద BNS 163(144 సెక్షన్) విధించామన్నారు. మొత్తం 69 సెంటర్లు ఏర్పాటు చేయగా 12,903 మంది విద్యార్థులు పరీక్షలు రానున్నారు.