News March 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

Similar News

News March 20, 2025

చాహల్ భార్యకు భరణం.. మహ్వాష్ పోస్ట్ వైరల్!

image

తన భార్య ధనశ్రీ వర్మకు టీమ్ఇండియా బౌలర్ చాహల్ విడాకులిచ్చిన విషయం తెలిసిందే. దీనికోసం రూ.4.75 కోట్లు భరణం చెల్లించేందుకు అంగీకరించారు.. ఈ నేపథ్యంలో చాహల్ గర్ల్‌ఫ్రెండ్ RJ మహ్వాష్ ఇన్‌స్టాలో చేసిన పోస్టు వైరలవుతోంది. ‘అబద్ధాలు, దురాశ, మోసాలకు దూరంగా ఉంచిన ఆ దేవునికి ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను చాహల్ కూడా లైక్ చేయడం గమనార్హం.

News March 20, 2025

IPL రూల్స్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

image

IPLలో కొన్ని రూల్స్‌పై బీసీసీఐ BCCI కీలక నిర్ణయం తీసుకుంది. సలైవాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చని తెలిపింది. ఈ నిర్ణయం బౌలర్లకు కలిసొస్తుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో 2 బంతులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. రెండో ఇన్నింగ్స్ 11 ఓవర్ల తర్వాత రెండో బంతిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను యథావిధిగా కొనసాగించనుంది.

News March 20, 2025

చట్ట అనుమతి ఉన్న గేమ్స్‌కే ప్రచారం: VD టీమ్

image

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌పై హీరో విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. ‘రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని మాత్రమే ఆయన అంబాసిడర్‌గా పనిచేసేందుకు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చట్ట అనుమతి ఉన్న గేమ్స్‌కి మాత్రమే ఆయన ప్రచారం చేసేందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎ23 సంస్థతో విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీం కూడా పలుమార్లు చెప్పింది’ అని ఆయన టీమ్ వివరణ ఇచ్చింది.

error: Content is protected !!