News March 20, 2025
ఖానాపూర్: గుడుంబా విక్రయం.. 2ఏళ్ల జైలు శిక్ష: SI

ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మాసం రాజేశ్వర్ గతంలో గుడుంబా విక్రయిస్తూ పట్టుబడగా కేసు నమోదు చేసి తహశీల్దార్ ముందు బైండోవర్ చేశామని ఎక్సైజ్ ఎస్సై అభిషేకర్ తెలిపారు. బైండోవర్ ఉల్లఘించి మళ్లీ మద్యం అమ్ముతూ దొరకారన్నారు. దీంతో బైండోవర్ నిబంధనల ప్రకారం నిందితుడికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.
Similar News
News March 20, 2025
ఈ అవార్డుతో నా హృదయం ఉప్పొంగింది: చిరు

UK పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో పార్లమెంట్ సభ్యులు, మంత్రుల నుంచి అవార్డు అందుకోవడంతో తన హృదయం ఉప్పొంగిపోయిందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘బ్రిడ్జ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ గౌరవం మరింత శక్తితో నా పనిని కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. నా ప్రయాణంలో తోడున్న, నా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
News March 20, 2025
జగిత్యాల: అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగిత్యాలలో గురువారం నిర్వహించిన డిస్టిక్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, డిఎస్పీలు రఘుచందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
News March 20, 2025
OFFICIAL: చాహల్, ధనశ్రీ విడాకులు

భారత క్రికెటర్ చాహల్, ధనశ్రీ విడాకుల పిటిషన్‌పై ముంబైలోని ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. వీరికి విడాకులు మంజూరు చేసింది. దీనికోసం ధనశ్రీకి రూ.4.75 కోట్లు భరణం చెల్లించేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించారు. అందులో కొంత మొత్తాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ తీర్పు కోసమే చాహల్ IPL జట్టులో ఇంకా చేరకుండా ఉన్నారు.