News March 20, 2025
చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News March 20, 2025
చరిత్ర సృష్టించిన ‘ఛావా’

శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చరిత్ర సృష్టించింది. ‘బుక్ మై షో’లో 12 మిలియన్ టికెట్లు సేల్ అయిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. దేశంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు(రూ.767కోట్లు), విడుదలైన ఐదో వారంలో రూ.22కోట్లు వసూలు చేసిన తొలి మూవీగానూ హిస్టరీ క్రియేట్ చేసింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా FEB 14న రిలీజైన విషయం తెలిసిందే.
News March 20, 2025
సిద్దిపేట: రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

శుక్రవారం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ.. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
News March 20, 2025
విశాఖలో పార్టీ మారిన వైసీపీ కార్పొరేటర్లు

జీవీఎంసీలో ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు నారా లోకేశ్, పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేనలో గురువారం చేరారు. పార్టీ మారిన వారిలో 13వ వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత, 17వ వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య, 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, 54వ వార్డు కార్పొరేటర్ చల్లా రజిని, 57వ వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి, 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ ఉన్నారు.