News March 20, 2025
వచ్చే నెల 19న నంద్యాలకు రానున్న సీఎం

సీఎం చంద్రబాబు వచ్చే నెల 19న నంద్యాలకు రానున్నారు. హరిజనవాడ సమీపంలోని కంపోస్ట్ యార్డులో క్లీన్ అండ్ గ్రీన్‌తో పాటు అక్కడే సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నంద్యాలకు తొలిసారి వస్తున్నారని టీడీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడు మనియార్ ఖలీల్ అహ్మద్ తెలిపారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News January 11, 2026
సంక్రాంతికి స్టాలిన్ కానుక.. రూ.3వేలు, చీర, ధోతి, బియ్యం, చక్కెర

తమిళనాడు ప్రజలకు స్టాలిన్ ప్రభుత్వం రూ.6,936 కోట్లతో సంక్రాంతి కానుకలు అందిస్తోంది. రేషన్ కార్డు ఉన్న 2.22 కోట్ల కుటుంబాలకు రూ.3వేలతో పాటు కేజీ బియ్యం, కేజీ చక్కెర, చెరకు గడ, చీర, ధోతి ఉచితంగా పంపిణీ చేస్తోంది. రేషన్ దుకాణాల వద్ద రద్దీ లేకుండా ముందే ఇంటింటికీ టోకెన్లు అందించారు. దాంట్లో ఉన్న తేదీ ప్రకారం జనవరి 12 వరకు దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చు. కాగా ఏపీ, టీజీలో ఇలాంటి స్కీమ్ లేదు.
News January 11, 2026
న్యూజిలాండ్ జట్టులో భారతీయుడు.. ఎవరీ ఆదిత్య?

INDతో జరుగుతున్న తొలివన్డేలో న్యూజిలాండ్ జట్టులో మరో భారతీయుడు చోటుదక్కించుకున్నారు. లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ 2002 సెప్టెంబర్ 5న వేలూరు(TN)లో పుట్టారు. అతడికి 4 ఏళ్ల వయసప్పుడే ఫ్యామిలీ న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. 2023 ఆగస్టులో NZ తరఫున టీ20ల్లో, డిసెంబర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశారు. అప్పుడప్పుడూ భారత్‌కు వస్తుంటారు. CSK అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. రజినీకాంత్‌కు ఆదిత్య పెద్ద ఫ్యాన్.
News January 11, 2026
ఇండస్ట్రీలో ఆర్గనైజ్డ్ అటాక్స్: విజయ్ దేవరకొండ

డియర్ కామ్రేడ్ మూవీ నుంచే ఇండస్ట్రీలో ఆర్గనైజ్డ్ అటాక్స్ చూసినట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీకి టికెటింగ్ యాప్స్‌లో <<18819623>>రేటింగ్<<>> బ్యాన్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘అసలు మనుషులు ఇలా ఎందుకు చేస్తారని మథనపడే వాడిని. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. సినిమాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని కోర్టు గుర్తించింది. ఇది పరిష్కారం కాదు.. కేవలం ఉపశమనం మాత్రమే’ అని<


