News March 24, 2024
నెల్లూరు: వీఆర్‌సీలో హోలీ సంబరాలు

నెల్లూరు పట్టణం వీఆర్‌సీ మైదానంలో హోలీ పండుగ సంబరాలు జరిగాయి. పట్టణంలోని యువతీ యువకులు రంగులు చల్లుకుని ఉత్సాహంగా డాన్స్‌లు వేశారు. నీటి పైపుల ద్వారా నీటిని ఆకాశంలోకి వర్షంలా వెదజల్లి డాన్స్ లు చేశారు. యువత కేరింతలతో మైదానం దద్దరిల్లింది. మంచి నీటి ఏర్పాటు, రంగుల ఏర్పాట్లు ముందుగా సిద్ధం చేసుకొని హోలీ జరుపుకున్నారు.
Similar News
News March 25, 2026
నెల్లూరులో ఇద్దరు అధికారులపై వేటు

నెల్లూరు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల విషయంలో అవకతవకలు జరగడంతో ZP ఏవో RPS వర్మను సస్పెండ్ చేస్తూ జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే శిక్షణ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అధిక బిల్లులు సమర్పించిన డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ యహోషువాను APSIRDకి సరెండర్ చేశారు. ట్రైనింగ్ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడడంతో చర్యలు తీసుకున్నారు.
News March 25, 2026
నెల్లూరు జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం గూడూరు ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.
News March 25, 2026
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : మెప్మా పీడీ

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరించాలని మెప్మా పీడీ లీలారాణి అధికారులకు సూచించారు. మంగళవారం బుచ్చి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ధాన్యం మండీలను వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలులో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద ధాన్యం సేకరించాలని తెలిపారు.


