News March 20, 2025

SRPT: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ఆహ్వానం

image

SRPT జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 5 వరకు http://tgobmmsnew.cgg.gov.inలో అప్లై చేసుకుంటే అర్హులైన వారి జాబితాను జూన్ 02న ప్రకటించి, ఒక్కొక్క నియోజకవర్గాలలో సుమారు 4 నుంచి 5వేల యూనిట్లు మంజూరు చేయనున్నారు అని అన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లో సంప్రదించాలన్నారు.

Similar News

News November 7, 2025

RBI సంస్కరణలతో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం: సంజయ్

image

రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, విధానపరమైన నిర్ణయాలే దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేశాయని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. RBI చేపట్టిన సంస్కరణల వల్లే 2018లో నష్టాల్లో ఉన్న SBI ఇప్పుడు 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిందన్నారు. 27గా ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను 12కి తగ్గించడం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి కారణమని SBI బ్యాంకింగ్, ఎకనమిక్స్ కాన్‌క్లేవ్-2025లో అన్నారు.

News November 7, 2025

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి: కలెక్టర్

image

నక్కపల్లి మండలం పెదబోదిగల్లంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసేలా సహకరించాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో వీవీ రమణ, తహశీల్దార్ నర్సింహమూర్తి, డీఎల్ పురం, చందనాడ, మూలపర్రకు చెందిన కొందరితో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణణానికి కొంత సమయం కావాలని, భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరారు.

News November 7, 2025

అన్నవరం దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు

image

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు శుక్రవారం నిత్య కల్యాణ మండపంలో నిర్వహించారు. 30 రోజులకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా ఆలయానికి రూ.1 కోటి 73 లక్షల 37 వేల ఆదాయం లభించింది. భక్తులు 37 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సమర్పించారని ఈఓ సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రోహిత్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.