News March 20, 2025
మల్యాల: రెండు పీఏసీఎస్‌లకు స్పెషల్ ఆఫీసర్స్

మల్యాల మండలంలోని పోతారం, నూకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో స్పెషల్ ఆఫీసర్స్‌ను నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా సొసైటీలో అసిస్టెంట్ రిజిస్టర్లు సుజాత, శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టినట్లు సీఈవోలు తెలిపారు. అయితే బీఆర్ఎస్ ప్రాతినిథ్యం వహిస్తున్న సొసైటీలలో మాత్రమే స్పెషల్ ఆఫీసర్స్ నియమించడం ఎంతవరకు సమంజసమని నూకపల్లి సొసైటీ ఛైర్మన్ మధుసూదన్ రావు ప్రశ్నించారు.
Similar News
News March 21, 2025
మార్చి21: చరిత్రలో ఈరోజు

*1916: సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం *1933: పేరిణి శివతాండవ నాట్యచారుడు నటరాజ రామకృష్ణ జననం *1970: హీరోయిన్ శోభన జననం *1978: ప్రముఖ సినీనటి రాణి ముఖర్జీ జననం
ప్రపంచ అటవీ దినోత్సవం
ప్రపంచ కవితా దినోత్సవం
ప్రపంచ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం
News March 21, 2025
గద్వాల: సుంకేసుల డ్యామ్‌ను పరిశీలించిన కలెక్టర్

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని, ప్రాజెక్టు పనితీరును జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ గురువారం పరిశీలించారు. అనంతరం రాజోలి గ్రామ సమీపాన ఉన్న సుంకేసుల బ్యారేజిని సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో.. తహశీల్దార్ రామ్మోహన్, ఎస్ఐ జగదీశ్వర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దస్తగిరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News March 21, 2025
వనపర్తిలో వ్యక్తికి జైలు శిక్ష

ప్రజలు ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపవద్దని వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి అన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వనపర్తికి చెందిన రమేశ్ నాయక్ అనే వ్యక్తిని గురువారం కోర్టులో హాజరు పరచగా.. అతడికి కోర్టు 6 రోజుల జైలు శిక్ష విధించామని తెలిపారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.