News March 20, 2025
అనంతపురంలో యువతి ఆత్మహత్య

అనంతపురంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మైథిలి అనే యువతి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 10న మైథిలి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 21, 2025
ప్రేమ విఫలం.. ధర్మవరంలో యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని ధర్మవరం పట్టణం గిర్రాజు కాలనీకి చెందిన బద్దెల ఓబునాథ్(35) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందిన వివరాల మేరకు.. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. నిరాకరించిందని మనస్తాపం చెంది గురువారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓబునాథ్ టైల్స్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 21, 2025
అనంతపురం అభివృద్ధిపై సీఎంతో చర్చ

విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును గురువారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితుల గురించి ఇరువురూ చర్చించారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ తరలింపు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరువ వంక ప్రొటెక్షన్ వాల్ గురించి సీఎంకు వివరించినట్లు ఎమ్యెల్యే తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
News March 21, 2025
CMను కలిసిన అనంత దళిత ఎమ్మెల్యేలు

అమరావతిలో సీఎం చంద్రబాబును శింగనమల, మడకశిర ఎమ్మెల్యేలు బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. దళితులందరికీ సమాన న్యాయం చేకూరాలనే ఉక్కు సంకల్పంతో చంద్రబాబు గతంలో చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి దళిత శాసనసభ్యులందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.