News March 20, 2025
నా రాజీనామాను ఆమోదించండి: ఎమ్మెల్సీ పద్మశ్రీ విజ్ఞప్తి

శాసనమండలి సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని కాకినాడకు చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ శాసనమండలి ఛైర్మన్‌ను కోరారు. గతేడాది ఆగస్టు 30న తన రాజీనామా లేఖను శాసనమండలి స్పీకర్‌కు అందించిన ఇంతవరకు ఆమోదించలేదని నా రాజీనామా ఆమోదించి నన్ను పదవి నుంచి తప్పించండి అంటూ మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు బుధవారం జరిగిన మండలి సమావేశంలో ఆమె విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 21, 2025
కన్యాకుమారి- గుంటూరుకి ప్రత్యేక రైలు.!

చీపురుపల్లి నుంచి గుంటూరు మీదుగా కన్యాకుమారికి ప్రత్యేక రైలు నడవనట్లు దక్షిణామద్య రైల్వే గురువారం సాయంత్రం తెలిపారు. ట్రైన్ నంబర్ 07230 చీపురుపల్లి టు కన్యాకుమారి, 07229 కన్యాకుమారి నుంచి చీపురుపల్లి ఏప్రిల్ రెండో తారీకు నుంచి జూన్ 27వ తారీకు వరకు ఈ రైలు సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. ఈ సౌకర్యని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు.
News March 21, 2025
పల్నాడు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై JC సమీక్ష

పల్నాడు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్ల కేటాయింపు, చిన్న, సూక్ష్మత రహ పరిశ్రమలకు ప్రోత్సాహంపై చర్చించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ అనుమతుల పురోగతి గురించి చర్చించారు. మార్చి నెలలో 129 దరఖాస్తులు రాగా.. 122 ఆమోదించబడ్డాయని కమిటీ తెలిపింది. బ్యాంకులలో రుణాలు వేగంగా ఉండాలన్నారు.
News March 21, 2025
డీలిమిటేషన్ సదస్సుకు హాజరుకానున్న టీపీసీసీ అధ్యక్షుడు

ఈ నెల 22న చెన్నైలో జరిగే డీలిమిటేషన్ సదస్సుకు కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరవుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. డీఎంకే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ పాల్గొననున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.