News March 20, 2025
HYD: ఓయూ బంద్‌కు పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్‌కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News November 7, 2025
రాజోలు: అండర్ 14 క్రికెట్ జట్టుకు రితీశ్ రాజ్ ఎంపిక

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఎంపిక కార్యక్రమంలో మలికిపురానికి చెందిన బత్తుల రితీశ్ రాజ్ అండర్-14 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారుడు. ఈ సందర్భంగా దళిత చైతన్య వేదిక నాయకులు రితీశ్ రాజ్‌ను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు పాలమూరి శ్యాంబాబు, బత్తుల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News November 7, 2025
SBI అరుదైన ఘనత

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.
News November 7, 2025
MGBS నుంచి పంచ శైవక్షేత్రాలకు స్పెషల్ బస్సులు

కార్తీకమాసం సందర్భంగా పంచశైవక్షేత్రాల దర్శనానికి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు TGSRTC అధికారులు వెల్లడించారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి, భీమవరం సోమేశ్వరస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి, సామర్లకోట భీమలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించేలా బస్సు సేవలు తీసుకొచ్చారు. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు MGBS నుంచి బస్సు బయలుదేరుతంది. తిరిగి మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.
SHARE IT


