News March 20, 2025

విశాఖలో రేషన్ కార్డు ఉన్నవారికి గమనిక

image

విశాఖలో మొత్తం 15,91,448 రైస్ కార్డుల సభ్యులకుగాను 1,64,985 సభ్యులకు ఈకేవైసీ అవ్వలేదని పౌరసరఫరాల శాఖాధికారిణి కళ్యాణి బుధవారం తెలిపారు. ఈకేవైసీ నమోదు కానీ వారి జాబితా సచివాలయంలో, ఏఎస్‌వో, తహశీల్దార్ కార్యాలయాల్లో ఉంటుందన్నారు. 6-60 ఏళ్ల లోపు వారు దగ్గరలో రేషన్ డిపోలో మార్చ్ 31వ తేద లోపు ఈకేవైసీ చేసుకోవాలని సూచించారు. ఈకేవైసీ అవ్వకుంటే రేషన్ నిలిచిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు. 

Similar News

News March 23, 2025

కశింకోటలో యాక్సిడెంట్.. UPDATE

image

కశింకోట మండలం త్రిపురవానిపాలెం జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా అవతలి రోడ్డుకు వెళ్లడానికి లారీని మలుపు తిప్పాడు. అదే మార్గంలో వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో వెనక లారీ డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు

News March 23, 2025

విశాఖ: మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు

image

విశాఖలో 2021లో హత్యకు గురైన జి.శ్రీను కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు <<15852353>>మర్డర్ మిస్టరీ<<>>ని ఛేదించారు. జీ.శ్రీను తమ్ముడు తోటయ్య దొంగలించిన ఫోన్‌ను లాలం గణేశ్‌కు అమ్మాడు. దీనిని గణేశ్ తమ్ముడు వాడగా ట్రాక్ చేసిన పోలీసులు తోటయ్యను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం రూ.10,000 ఖర్చు అయిందని శ్రీను గణేశ్‌ను డబ్బులు అడిగే వాడు. దీంతో శ్రీను-గణేశ్‌ మధ్య వాగ్వాదం జరగ్గా.. అది హత్యకు దారి తీసినట్లు దర్యాప్తులో తేలింది.

News March 23, 2025

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ

image

రుషికొండ బీచ్ తన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను తిరిగి పొందింది. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌పై విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా బ్లూ ఫ్లాగ్ ఇండియా జాతీయ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ కురూప్, బ్లూ ఫ్లాగ్ ఇండియా జ్యూరీ సభ్యుడు అజయ్ సక్సేనా విశాఖ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కుఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని శనివారం అందజేశారు.

error: Content is protected !!