News March 20, 2025
బై.. బై.. ముగిసిన ‘ఇంటర్ ప్రథమ’ పరీక్షలు

నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. తల్లిదండ్రులతో సొంతూరిలో సరదాగా గడపడం కోసం ఎపుడెపుడా అని నిరీక్షించిన విద్యార్థులకు ఆ సమయం వచ్చేసింది. పరీక్షలు ముగిసిన వెంటనే సొంతూళ్లకు ఉరుకులు పరుగులు పెట్టారు. పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వస్తూనే కేరింతలతో సందడి చేశారు. ఊళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి.
Similar News
News March 21, 2025
NLG: విద్యార్థుల్లారా.. విజయీభవ..!

జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 18,925 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కాగా టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్షలు ప్రశాంతంగా రాయాలన్నారు.
News March 21, 2025
నల్గొండ: గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటిన యువతి

త్రిపురారం మండలం మాటూరుకి చెందిన పోలగాని నరసింహ గౌడ్, వెంకాయమ్మ దంపతుల కుమార్తె శ్వేత గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటింది. గ్రూప్-1లో 467మార్కులు, గ్రూప్-2లో 412 స్టేట్ ర్యాంక్, గ్రూప్-3లో 272 ర్యాంక్ సాధించింది. 3 నెలల క్రితం గ్రూప్-4 ఉద్యోగం సాధించి అడవిదేవులపల్లి MRO ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. గ్రూప్స్‌లో సత్తా చాటడంతో పలువురు శ్వేతను అభినందిస్తున్నారు.
News March 21, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో కృషి చేయాలి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అలాగే రోడ్లపై సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల విలువైన ప్రాణాలు పోతున్నట్లు చెప్పారు.