News March 20, 2025
ఉమ్మడి ఖమ్మంలో ప్రాజెక్టులకు రూ.770 కోట్లు

అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నిధులు దండిగా కేటాయించారు. సీతారామకు రూ.699.53 కోట్లు, ఎర్రుపాలెం(ఎల్ఐ) రూ.39.93 కోట్లు, కిన్నెరసానికి రూ.13.33 కోట్లు, తాలిపేరు రూ.7.30 కోట్లు, భక్తరామదాసు రూ.9 లక్షలు, లంకాసాగర్ రూ.1లక్ష కేటాయించారు. వ్యవసాయరంగానికి ఊతమిచ్చేలా జిల్లాకు నిధులు కేటాయించారని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది.
Similar News
News March 21, 2025
KMM: ఇందిరమ్మ ఇళ్లకు 69,536 అర్హుల గుర్తింపు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఆశావహులకు ఇటీవలి బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు రూ.12,571 కోట్లు కేటాయించగా, ఖమ్మం జిల్లాలో 37,444, భద్రాద్రి జిల్లాలో 32,092 మంది అర్హులను గుర్తించారు, లిస్ట్ ఫైనల్ చేసి తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. అతి త్వరలోనే లిస్ట్ రిలీజ్ చేసే సూచనలు కనిపిస్తుండగా, స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
News March 21, 2025
ఉగాది నుంచి సన్నబియ్యం: మంత్రి పొంగులేటి

ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈరోజు పెనుబల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తుందని వెల్లడించారు. ప్రజా పాలనలో అందరికీ మేలు జరుగుతుందని వివరించారు.
News March 21, 2025
ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

రబీ సీజన్లో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో 2024-25 రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత అంచనా ప్రకారం రబీ సీజన్ కు సంబంధించి 1,85,000 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 73,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మొత్తం 2,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామన్నారు.