News March 20, 2025

రామచంద్రపురం : పోలీసుల ఎదుట లొంగిపోయిన కసాయి తండ్రి

image

ఇద్దరు కన్న బిడ్డలను కాలువలో తోసేసి పరారైన రాయవరం (M) వెంటూరుకు చెందిన పిల్లి రాజు బుధవారం రామచంద్రపురం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. సోమవారం నెలపర్తిపాడు శివారు గణపతి నగరం సమీపంలోని పంట కాలువలో కారుణ్యశ్రీ (7), రామ సందీప్‌(10)ను తండ్రి రాజు పంట కాలువలో తోసేసిన విషయం తెలిసిందే. కారుణ్యశ్రీ మృత్యువాత పడగా సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు.

Similar News

News March 22, 2025

MBNR: ‘పల్లెల్లో అడుగంటిన అభివృద్ధి’

image

పాలమూరులో గడచిన 14 నెలలుగా గ్రామాల్లో స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేకపోవటంతో ప్రజలకు సేవలు అందించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి తెచ్చింది. గత 14 నెలలుగా పల్లెల్లో అభివృద్ధి అడుగంటి పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. నిధులు లేకపోవడంతో వీధి దీపాల ఏర్పాటు,పారిశుద్ధ్యం, మురుగు, తాగునీటి సరఫరా వంటి ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

News March 22, 2025

KMR: ప్రేమ పేరుతో వివాహం.. కుల వివక్షతతో పారిపోయిన భర్త

image

లింగంపేట్ మండలం కొమాట్‌పల్లికి చెందిన నెల్లూరి భాగ్య అదే గ్రామానికి చెందిన చిటురి రాకేశ్ ప్రేమ వివాహం చేసుకుని కడుపులో బిడ్డను చంపి అన్యాయం చేశాడని బాధితురాలు ఆరోపించింది. రోడ్డుపై వదిలేసి వెళ్లిపోడంటూ.. భర్త ఇంటి ఎదుట శుక్రవారం భార్య ఆందోళనకు దిగింది. 2023లో యాదగిరి గుట్టలో ప్రేమవివాహం చేసుకోని, మోసం చేసి పారిపోయాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టింది.

News March 22, 2025

వనపర్తి: ప్రతి ఒక్క దివ్యాంగుడికి యూనిక్ డిజేబుల్ ఐడీ: కలెక్టర్

image

ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం యూనిక్ డిజేబుల్ ఐడీని అమల్లోకి తీసుకొచ్చిందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనిక్ డిజేబుల్ ఐడీ అంశంపై ఎంపీడీవోలు, మీసేవ ఆపరేటర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. యూడీఐడీ కార్డు కోసం దివ్యాంగులు ఆన్లైన్ (www.swavlambancard.gov.in) ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.

error: Content is protected !!