News March 20, 2025
ఆ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు

దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC)లో పని చేసే ఉద్యోగుల వేతనాలు వచ్చే ఏడాదిలో 9.8% మేర పెరగనున్నట్లు ఓ నివేదిక అంచనా వేసింది. ఉద్యోగుల వేతనాల వృద్ధిలో GCCలు IT కంపెనీలను మించిపోయాయంది. 2030 నాటికి వీటి మార్కెట్ విలువ 11,000కోట్ల డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. దీంతో నైపుణ్యాలున్న ఉద్యోగులకు వేతనాలు గణనీయంగా పెరుగుతాయంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై GCCలు అధిక జీతాలు చెల్లిస్తున్నాయి.
Similar News
News March 21, 2025
పులిచెర్ల: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కల్లూరు పోలీసులకు సమాచారం అందడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకున్నారు. కారు, నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.
News March 21, 2025
ఉదయాన్నే వేడి నీరు తాగుతున్నారా?

నిద్ర లేవగానే చాలా మంది నీళ్లు తాగుతుంటారు. అయితే బరువు తగ్గడం కోసం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా వేడి నీరు తీసుకుంటే దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే టేస్ట్ బడ్స్ కూడా దెబ్బతిని ఆహార పదార్థాల రుచి తెలియకుండా పోతుంది. జీర్ణ వ్యవస్థనూ ఇబ్బంది పెట్టి కడుపునొప్పికి కారణమవుతుంది. గోరు వెచ్చని నీరు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
News March 21, 2025
ALL TIME RECORD

TG: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరింది. తొలి సారిగా నిన్న సాయంత్రం 17,162 మెగావాట్లకు చేరిందని అధికారులు తెలిపారు. మరోవైపు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తామని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఏసీలు, కూలర్ల వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.