News March 20, 2025
ఎన్టీఆర్: బీటెక్ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో DEC 2024లో నిర్వహించిన బీటెక్ 1వ సెమిస్టర్ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మార్చి 24వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సీటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు.
Similar News
News March 2, 2026
SRCL: బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, వారికి పోలీసు సేవలను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి 31 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News March 2, 2026
ఉగాది నాటికి 16,702 ఇళ్ల పూర్తి లక్ష్యం సాధించాలి: జేసీ

అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఉగాది నాటికి జిల్లాకు కేటాయించిన 16,702 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఏ బిల్లుల అప్లోడ్, స్వామిత్వం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు.
News March 2, 2026
కామారెడ్డి: ప్రజాస్వామ్య విలువలకు నిలువుటద్దం దుద్దిల్ల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, దివంగత నాయకుడు దుద్దిల్ల శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలను కాపాడిన మహోన్నత నేత అని కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి కొనియాడారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి వేడుకలను నిర్వహించారు. అదనపు ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.


