News March 20, 2025

సంచిలో ట్రాన్స్‌జెండర్ తల, చేయి లభ్యం

image

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం రేపింది. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ 8 టీమ్‌లతో దర్యాప్తు చేపట్టి చనిపోయింది దీపుగా గుర్తించారు. అయితే ఆమె తల, మరో చేయి అనకాపల్లి వై జంక్షన్ వద్ద సంచిలో దొరికాయి.

Similar News

News March 21, 2025

పులిచెర్ల: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

image

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కల్లూరు పోలీసులకు సమాచారం అందడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకున్నారు. కారు, నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.

News March 21, 2025

‘మిస్ తెలుగు USA-2025’ పోటీలో ఖమ్మం యువతి

image

తెలుగుభాష గొప్పతనం, సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు నిర్వహిస్తున్న ‘మిస్ తెలుగు USA-2025’ పోటీల్లో ఖమ్మం జిల్లా యువతి ఫైనల్‌కు చేరి జిల్లా కీర్తిని ఎగరేసింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన హెచ్ఎం పిల్లలమర్రి శివ నర్సింహారావు కుమార్తె గీతిక ‘మిస్ తెలుగు USA-2025’ పోటీల్లో ఫైనలిస్టుగా చేరి అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారు.

News March 21, 2025

ఉదయాన్నే వేడి నీరు తాగుతున్నారా?

image

నిద్ర లేవగానే చాలా మంది నీళ్లు తాగుతుంటారు. అయితే బరువు తగ్గడం కోసం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా వేడి నీరు తీసుకుంటే దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే టేస్ట్ బడ్స్ కూడా దెబ్బతిని ఆహార పదార్థాల రుచి తెలియకుండా పోతుంది. జీర్ణ వ్యవస్థనూ ఇబ్బంది పెట్టి కడుపునొప్పికి కారణమవుతుంది. గోరు వెచ్చని నీరు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

error: Content is protected !!