News March 20, 2025
HCA మాజీ కోశాధికారి ఆస్తి సీజ్

TG: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనుల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తులో ఈడీ పట్టు బిగించింది. HCA మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్ చేసిన అవినీతిపై ఆధారాలతో ED రూ.90.86 లక్షల అక్రమ సొమ్మును సీజ్ చేసింది. అజహరుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన పనుల్లో క్విడ్ ప్రోకో కింద అపెక్స్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. సురేందర్ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు విచారణలో తేలింది.
Similar News
News March 28, 2025
జస్టిస్ వర్మపై FIR నమోదు చేయాలని డిమాండ్

ఢిల్లీ హైకోర్టు జడ్జి <<15855499>>యశ్వంత్ వర్మపై<<>> FIR నమోదు చేయాలని మాథ్యూ నెడుంపారా అనే లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ అనవసరమని మాథ్యూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసుల నేతృత్వంలో దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
News March 28, 2025
సౌత్ ఆడియన్స్ మా సినిమాలను చూడరు: సల్మాన్ ఖాన్

భారీ బడ్జెట్ సినిమాలను తీయడం చాలా కూడుకున్నదని, దానికి బలమైన స్క్రిప్ట్ ఉండాలని సల్మాన్ ఖాన్ అన్నారు. ‘సికందర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘సౌత్ సినిమాలను హిందీ ఆడియన్స్ చూస్తారు. కానీ సౌత్ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలను చూడరు. నేను ఎంతో మంది సౌత్ డైరెక్టర్లు, టెక్నీషియన్లతో పనిచేశాను. కానీ నా సినిమాలు దక్షిణాదిలో అంతగా ఆడటం లేదు’ అని పేర్కొన్నారు.
News March 28, 2025
భారత్ ఖాతాలో మరో 3 పతకాలు

ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. ముగ్గురు మహిళా రెజ్లర్లు మెడల్స్ సాధించారు. రీతిక 76 కేజీల విభాగంలో సిల్వర్, ముస్కాన్ (59kgs), మాన్సీ(68kgs) బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ గెలిచిన పతకాల సంఖ్య 5కు (1 సిల్వర్, 4 బ్రాంజ్) చేరింది. ఈ పోటీలు జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతున్నాయి.