News March 20, 2025
సంచిలో ట్రాన్స్‌జెండర్ తల, చేయి లభ్యం

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం రేపింది. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ 8 టీమ్‌లతో దర్యాప్తు చేపట్టి చనిపోయింది దీపుగా గుర్తించారు. అయితే ఆమె తల, మరో చేయి అనకాపల్లి వై జంక్షన్ వద్ద సంచిలో దొరికాయి.
Similar News
News March 21, 2025
విశాఖలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

విశాఖలో ఇంటర్ విద్యార్థి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. GRP పోలీసుల వివరాల ప్రకారం.. కంచరపాలెంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న అంబటి రేవంత్ కుమార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షలు సరిగా రాయలేదంటూ మనస్తాపం చెందాడు. ఈక్రమంలోనే బుధవారం అర్ధరాత్రి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 21, 2025
జీవీఎంసీలో మారనున్న పార్టీల బలాబలాలు

జీవీఎంసీలో పార్టీల బలాబలాలు మారనున్నాయి. 97 వార్డుల్లో అత్యధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌గా హరి వెంకట కుమారి ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో జీవీఎంసీపై ప్రభావం పడింది. 9 మంది కార్పొరేటర్ టీడీపీలో చేరగా.. ఒక కార్పొరేటర్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కూటమి బలం పుంజుకుంది. కాగా అవిశ్వాస తీర్మాన అంశం తెరపైకి వచ్చింది.
News March 21, 2025
విశాఖలో అడ్మిషన్స్‌కు ఆహ్వానం

భీమిలి, ఆనందపురం, పద్మనాభం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి బాలికలకు అడ్మిషన్స్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అదనపు పథక సమన్వయకర్త చంద్ర శేఖర్ గురువారం తెలిపారు. 6వ తరగతిలో 120 సీట్లు,11వ తరగతిలో 120 సీట్లు, 7వ తరగతిలో 2 సీట్లు,12వ తరగతిలో 23 సీట్లకు ఆన్ లైన్‌లో మార్చ్ 22నుంచి ఏప్రిల్ 11లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రేషన్ కార్డు ఉన్న బాలికలు మాత్రమే అర్హులు.