News March 20, 2025

సంచిలో ట్రాన్స్‌జెండర్ తల, చేయి లభ్యం

image

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం రేపింది. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ 8 టీమ్‌లతో దర్యాప్తు చేపట్టి చనిపోయింది దీపుగా గుర్తించారు. అయితే ఆమె తల, మరో చేయి అనకాపల్లి వై జంక్షన్ వద్ద సంచిలో దొరికాయి.

Similar News

News November 16, 2025

పెదఅమీరం: తొలి జీతం.. గ్రామదేవతకు అందజేత

image

కాళ్ల మండలం పెదఅమిరం గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ దేవాలయ అభివృద్ధికి ఉపాధ్యాయుడు బూరాడ వెంకటకృష్ణ శనివారం తన మొదటి జీతాన్ని అందజేశారు. మెగాడీఎస్సీ 2025 లో స్కూల్ అసిస్టెంట్(మాథ్స్) ఉద్యోగం సాధించిన వెంకటకృష్ణ తన తొలి జీతం మొత్తం రూ.50,099 లను ఆలయ అభివృద్ధి కమిటీ పెద్ద కోరా రామ్మూర్తికి అందజేశారు. ఆయనను పలువురు అభినందించారు.

News November 16, 2025

కామారెడ్డి: కన్న ఊరును వీడిన ‘బతుకు బండి’

image

చెరుకు సీజన్ షురూ కావడంతో గిరిజన ప్రాంతాల నుంచి వలసలు మొదలయ్యాయి. ప్రతి ఏటా మాదిరిగానే, ఈ ఏడాది కూడా సంగారెడ్డి జిల్లాకు చెందిన గిరిజనులు ఉపాధి నిమిత్తం కామారెడ్డి షుగర్ ఫ్యాక్టరీకి పయనమయ్యారు. ఉగాది పండుగ సమయానికి తిరిగి తమ సొంతూళ్లకు చేరుకుంటారు. సంగారెడ్డి జిల్లా వాసులు ఎడ్ల బండ్లు కట్టుకుని, తమ సామగ్రిని తీసుకుని పిట్లం మీదుగా శనివారం వెళ్తుండగా.. ‘Way2News’ క్లిక్ మనిపించిన దృశ్యమిది.

News November 16, 2025

జాతీయ స్థాయికి వానపల్లి విద్యార్థిని

image

కొత్తపేట మండలం వానపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని పలివెల లావణ్య టెన్నికాయిట్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించి ఆమె ఈ అర్హత సాధించారు. ఈ విషయాన్ని హెచ్‌ఎం ముద్రగడ వెంకటేశ్వరరావు శనివారం వెల్లడించారు. ఈ నెల 26 నుంచి 30 వరకు జమ్మూ కశ్మీర్‌లో జరిగే జాతీయ పోటీల్లో లావణ్య పాల్గొననున్నారు.