News March 20, 2025

మహబూబాబాద్ మార్కెట్‌కు పోటెత్తిన ఎర్రబంగారం

image

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి పోటెత్తింది. బుధవారం తేజ, తాలు రకం కలిపి 6,727 బస్తాల మిర్చి విక్రయాలు జరిగాయి. తేజ రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.13,639, కనిష్ఠ ధర రూ.9,500 తాలు రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.6,350, కనిష్ఠ ధర రూ.5,020 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News September 19, 2025

మాజీ సీఎం జగన్ రూట్ మార్పు

image

తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన వైఎస్‌ జగన్‌ ప్రయాణంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో జగన్ వాహనశ్రేణి ప్రకాశం బ్యారేజీ మీదుగా గన్నవరం బయలుదేరింది.

News September 19, 2025

HYD: నేడు HCUలో విద్యార్థి సంఘం ఎన్నికలు

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుతుంది. నేడు ఉ.9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపస్‌లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అనంతరం సాయంత్రం బ్యాలెట్ బాక్స్‌లను ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు.

News September 19, 2025

ఎల్లంపల్లి ప్రాజెక్ట్.. 38 గేట్లు ఎత్తివేత

image

గురువారం కురిసిన వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులోని 62 గేట్లలో 38 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మత్సకారులు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.