News March 20, 2025

వరంగల్: యూనివర్సిటీకి బడ్జెట్‌లో నిధులు ఎంతంటే.?

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.50కోట్లు, జీతభత్యాలకు రూ.145.62కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌లో జీతభత్యాలకు రూ.135కోట్లు, రూ.500కోట్లు ప్రతిపాదించగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్‌‌లో ప్రవేశ పెట్టిన నిధులను యూనివర్సిటీకి ఖర్చు చేస్తారో, లేదో.. వేచి చూడాలి

Similar News

News February 24, 2026

కలుపు తీయనివాడు కోత కోయడు

image

సాగులో ప్రధాన పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. రైతులు సరైన సమయంలో కలుపును తొలగించకపోతే, అది ప్రధాన పంటకు చేరాల్సిన పోషకాలను లాగేసుకొని పంట సరిగా పెరగదు. నిర్లక్ష్యం చేస్తే రైతుకు కోసేందుకు పంట కూడా మిగలదు. అలాగే నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దారిలో ఎదురయ్యే ఆటంకాలను (కలుపును) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది.

News February 24, 2026

పూజ ఇలా అస్సలు చేయకూడదు: పండితులు

image

ఖాళీ నుదుటితో దైవకార్యాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదని, ఇది అశుభాన్ని ప్రేరేపిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పూజా సమయంలో నుదుట బొట్టు తప్పనిసరి. విభూతి అయినా ధరించవచ్చు. తిలకధారణ ఏకాగ్రతను పెంచి, సాత్విక శక్తిని ప్రసాదిస్తుంది. లేకపోతే పూజ నిష్ఫలమవుతుంది. పూజలో పాల్గొనేటప్పుడు దైవత్వం కలగాలన్నా, స్వామి అనుగ్రహం పొందాలన్నా నుదుట తిలకధారణ తప్పనిసరి’ అని అంటున్నారు.

News February 24, 2026

నేను ఎంతకాలం ఉంటానో తెలీదు.. ప్రాణహానిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

image

ఫ్లోరిడాలోని ట్రంప్ రిసార్ట్‌లోకి చొరబడటానికి యత్నించిన ఓ దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ ట్రంప్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో నాకు తెలీదు. చాలామంది నన్ను టార్గెట్ చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రభావవంతమైన నేతలపైనే ఇలాంటి దాడులు జరుగుతాయంటూ లింకన్, కెన్నెడీ వంటి వారిని అందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.