News March 20, 2025
యూనివర్సిటీకి బడ్జెట్‌లో నిధులు ఎంతంటే.?

వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.50కోట్లు, జీతభత్యాలకు రూ.145.62కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌లో జీతభత్యాలకు రూ.135కోట్లు, రూ.500కోట్లు ప్రతిపాదించగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన నిధులను యూనివర్సిటీకి ఖర్చు చేస్తారో, లేదో.. వేచి చూడాలి.
Similar News
News March 21, 2025
సిరిసిల్ల జిల్లాలో చల్లబడ్డ వాతావరణం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శుక్రవారం పలు మండలాలలో వాతావరణం చల్లబడింది. గడిచిన 24 గంటల్లోనే ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. సిరిసిల్ల 37.7°c, గంభీరావుపేట 37.5°c, ఇల్లంతకుంట 37.1°c, చందుర్తి 37.1°c, రుద్రంగి 37.2°c, తంగళ్ళపల్లి 37.1°c కొనరావుపేట 36.9°c, బోయిన్పల్లి 36.0°c, తంగళ్ళపల్లి 37.1°c, ముస్తాబాద్ 35.9°c, లుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
News March 21, 2025
నిర్మల్ జిల్లాలో సినిమా షూటింగ్

సప్తగిరి -ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన పెళ్లి కానీ ప్రసాద్ చిత్రం నేడు విడుదల కానుంది. కాగా, అసోసియేట్ డైరెక్టర్ సుదీర్ రెడ్డి స్వగ్రామం మామడ మండలం కమల్ కోట్ కావడంతో పలు సన్నివేశాలు కమల్ కోట్‌తో పాటు లక్ష్మణ్ చందా మండలం వడ్యాల్‌లో చిత్రీకరించారు. దీంతో నేడు సినిమా రిలీజ్ కానుండటంతో సినిమా చూసేందుకు నిర్మల్ నియోజకవర్గ వాసులు ఆసక్తి చూపుతున్నారు.
News March 21, 2025
మంత్రి ఇంట తీవ్ర విషాదం

AP: మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఇంట్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఇవాళ మృతి చెందారు. శనివారం ఉదయం HYDలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపట్ల సీఎంతో పాటు మంత్రులు, ముఖ్య నేతలు సంతాపం తెలిపారు.