News March 20, 2025
ట్రాన్స్‌జెండర్ హత్య.. ప.గో జిల్లా వాసి అరెస్ట్

అనకాపల్లి జిల్లాలో దీపు అనే ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం రేపింన విషయం తెలిసిందే. అయితే ఇరగవరం(M) పొదలాడకు చెందిన బన్నీనే ఆ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నాలుగేళ్ల నుంచి ఆమెతో సహజీవనం చేస్తూ..గొడవలు రావడంతో హత్య చేసినట్లు సమాచారం. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్ SP వకుల్ జిందాల్ 8 టీమ్‌లతో దర్యాప్తు చేసి కేసు చేధించారు.
Similar News
News March 21, 2025
ప.గో జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

ప.గో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా భీమవరంలో గురువారం 36.54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గణపవరంలో ఇవాళ దాదాపు 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 21, 2025
భీమవరం: ఉద్యోగికి 15 రోజుల రిమాండ్

నిధుల దుర్వినియోగం కేసులో ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. వివరాల్లోకి వెళితే… భీమవరం మండలం చినఅమిరం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడైన జూనియర్ అసిస్టెంట్ గుండు రామకృష్ణను అరెస్ట్ చేసి రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ కాళీచరణ్ తెలిపారు.
News March 21, 2025
తానా సభలకు కేంద్రమంత్రి వర్మకు ఆహ్వానం

అమెరికాలో మిచ్ గన్‌లో జూలై 3,4,5 తేదీల్లో జరిగే తానా సభలకు కేంద్రమంత్రి వర్మను ఆహ్వానించారు. అసోసియేషన్ ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల, కార్యవర్గ సభ్యులు ఢిల్లీలో గురువారం కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. సభ్యులతో సమావేశమైన మంత్రి అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా పాల్గొన్నారు.