News March 20, 2025

నిర్మల్‌: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

image

నిర్మల్ జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 163 బీఎన్ఎస్ సెక్షన్‌ను అమలు చేస్తున్నామన్నారు.

Similar News

News March 28, 2025

ఈనెల 30 నుంచి తలంబ్రాల బుకింగ్ ప్రారంభం

image

భద్రాచలంలో జరిగే శ్రీ రామనవమి సందర్భంగా ముత్యాల తలంబ్రాలు బుకింగ్ ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. భక్తులు దేవస్థాన అధికారిక వెబ్ సైట్ www.bhadradritemple. telangana.gov.in ద్వారా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని ఆలయం ఈవో రమాదేవి తెలిపారు. ఉత్సవాలు పూర్తి అయిన తర్వాత తలంబ్రాలను బుక్ చేసుకున్న భక్తులకు పంపిస్తామని పేర్కొన్నారు.

News March 28, 2025

హీరోను అంటూ నమ్మించి దారుణం.. కేసు నమోదు

image

హీరోను అంటూ నమ్మించి మహిళను మోసం చేసిన ఘటనలో యువకుడిపై నెల్లూరు(D) చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి(D) కోట(M)నికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాలో సునీల్ రెడ్డి పరిచయం అయ్యాడు. హీరోను అంటూ నమ్మించి లాడ్జిలో శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో సునీల్ బెదిరించి దాడి చేశాడు.

News March 28, 2025

విజయనగరం: ఉప ఎన్నికల్లో YCP క్లీన్ స్వీప్

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాల్లో గురువారం నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. భోగాపురం వైస్ ఎంపీపీగా పచ్చిపాల నాగలక్ష్మి (వైసీపీ) ఎన్నిక కాగా, వివిధ మండలాల్లో మరో పది స్థానాల్లో జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంతకవిటి మండలంలోని మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా వైసీపీకి చెందిన షేక్ హయ్యద్ బీబీ ఎన్నికయ్యారు.

error: Content is protected !!