News March 20, 2025
వట్టిచెరుకూరు: అత్యాచార ఘటనలో వృద్దుడి మృతి

ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో బాలిక బంధువుల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వృద్దుడు మృతి చెందాడు. వట్టిచెరుకూరు సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిచెరుకూరు మండలంలో 2వ తరగతి చదువుతున్న బాలికపై థామస్ (60)అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలిక బంధువులు థామస్‌పై దాడి చేయడంతో చికిత్స పొందుతూ మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News March 21, 2025
రెంటచింతల: ఊయల తాడు బిగుసుకొని బాలుడి మృతి

ఊయల తాడు బిగుసుకొని ఓ బాలుడు మృతిచెందిన ఘటన రెంటచింతలలోని ఆంజనేయస్వామి మాన్యంలో జరిగింది. సలిబిండ్ల అద్విక్ రెడ్డి (10) ఐదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఇంట్లో ఉన్న ఊయలలో అతివేగంతో ఊగగా తాడు మెలికలు పడి బాలుడి గొంతుకు బిగుసుకొని చనిపోయాడు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుతూ పాడుతూ తిరిగిన బాలుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
News March 21, 2025
వనపర్తి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..

వనపర్తి జిల్లాలో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. పెబ్బేరులో 38.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మదనాపూర్లో 38.3℃, పాన్గల్ 38.2, పెద్దమండడి, విలియంకొండ 38.1, దగడ, రెమద్దుల 38.0, కనైపల్లి 37.9, ఆత్మకూరు 37.8, వీపనగండ్ల, గోపాలపేట 37.4, జనంపేట, వెల్గొండ 37.2, రేవల్లి, వనపర్తి, ఘనపూర్, సోలిపూర్ 37.1, శ్రీరంగాపురం 37.0, కేతేపల్లి 36.9, అమరచింతలో 35.8 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 21, 2025
తిరువూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మార్పుపై ఉత్కంఠ

తిరువూరులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మార్పు అంశంపై వైసీపీ ఆచూతూచి అడుగులు వేస్తోంది. ఒప్పందం ప్రకారం ఛైర్‌పర్సన్ మార్పు అంశాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక నేతలు.. ఛైర్మన్‌ను మార్చడం వల్ల పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు కౌన్సిలర్లు పార్టీ మారుతారని లోకల్‌గా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మున్సిపల్ పీఠాన్ని YCP నిలబెట్టుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.