News March 20, 2025
నేను బీఆర్ఎస్లోనే ఉన్నా: ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే

TG: తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వ రుసుము రూ.5వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ మారినట్లు ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.
Similar News
News March 21, 2025
మంత్రి ఇంట తీవ్ర విషాదం

AP: మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఇంట్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఇవాళ మృతి చెందారు. శనివారం ఉదయం HYDలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపట్ల సీఎంతో పాటు మంత్రులు, ముఖ్య నేతలు సంతాపం తెలిపారు.
News March 21, 2025
IPL: లక్నోకు ఆల్‌రౌండర్!

రేపు ఐపీఎల్-2025 ప్రారంభం కానుండగా పలు జట్లలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. బౌలర్ మోహ్సిన్ ఖాన్ స్థానంలో ఆయనను తీసుకున్నట్లు తెలిపాయి. సీఎస్కే, కేకేఆర్ వంటి జట్లకు ఆడిన శార్దూల్ వేలంలో అమ్ముడుపోలేదు. తర్వాత జరిగిన దేశవాళి టోర్నీల్లో సత్తా చాటారు.
News March 21, 2025
‘ఎల్లమ్మ’ సినిమాలో కీర్తి సురేశ్?

‘బలగం’ డైరెక్టర్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్ మేలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో హీరోయిన్గా కీర్తి సురేశ్ నటించే అవకాశాలున్నాయి. తాజాగా ఆమెకు డైరెక్టర్ స్టోరీ చెప్పినట్లు సమాచారం. దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. తొలుత సాయిపల్లవిని తీసుకోవాలనుకున్నారని, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.