News March 24, 2024
ఎమ్మిగనూరులో 29న సీఎం జగన్ ‘మేము సిద్ధం’ సభ

ఎమ్మిగనూరులో ఈనెల 29న సీఎం జగన్ పర్యటిస్తున్నట్లు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, MLC మధుసూదన్, కర్నూలు ఎంపీ అభ్యర్థి రామయ్య, ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టా రేణుక తెలిపారు. YWCS గ్రౌండ్‌లో సాయంత్రం మేము సిద్ధం భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
Similar News
News January 18, 2026
కర్నూలు: చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కోడుమూరు, గోనెగండ్ల, పెద్దకడబూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195, స్కిన్ రూ.300, స్కిన్‌లెస్ రూ.310-320 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
News January 17, 2026
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా మండల స్థాయిలో కార్యాచరణాత్మక వ్యవసాయ ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. ఈ-క్రాప్ బుకింగ్‌ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, వరికి బదులుగా మల్లెపూలు, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, అరటి వంటి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పంట సేకరణ, మార్కెటింగ్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
News January 17, 2026
కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.


