News March 20, 2025
పిఠాపురం సభపై పవన్ కళ్యాణ్ ట్వీట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయకేతనం సభ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తన ‘x’ ఖాతా వేదికగా ..జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇవే అంటూ ప్రకటన చేశారు. రాజకీయ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల అనంతరం సభా ప్రాంగణాన్ని శుభ్రపరిచి అందజేశామని అదే జనసేన సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు .
Similar News
News January 21, 2026
దానిమ్మ రైతులకు కాసుల పంట.. టన్ను రూ.2 లక్షలు

AP: దానిమ్మ రైతులకు మంచి రోజులు వచ్చాయి. 3 నెలల క్రితం టన్ను రూ.50వేల నుంచి రూ.60 వేల వరకు పలికిన దానిమ్మ ఇప్పుడు ఏకంగా రూ.2 లక్షలు పలుకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట తెగుళ్లు, బ్యాక్టీరియా బారిన పడకుండా జాగ్రత్తగా సాగు చేయడం వల్లే రేట్లు పెరిగాయని చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో 15వేలకు పైగా హెక్టార్లలో (ప్రధానంగా రాయలసీమ) దానిమ్మ పంట పండిస్తున్నారు.
News January 21, 2026
సంగారెడ్డి: జిల్లాలో బీజేపీ ప్రభారీల నియామకం

మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆయా మున్సిపాలిటీలకు ప్రభారీలను నియమించారు. సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు ప్రభారీలను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్‌గౌడ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రభారీగా పైడి ఎల్లారెడ్డి, అందోల్ జోగిపేట మున్సిపాలిటీకి జె.రంగారెడ్డి, నారాయణఖేడ్ ఆలే భాస్కర్ నియమితులయ్యారు.
News January 21, 2026
పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.


