News March 20, 2025

GNT: బంగారం చోరీ.. పట్టించిన తండ్రి

image

జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న యువకుడిని అతని తండ్రే పట్టాభిపురం పోలీసులకు అప్పగించాడు. కాకినాడకు చెందిన యువకుడు గుంటూరు విద్యానగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఈ నెల 7న రూ. కోటి విలువ చేసే బంగారాన్ని చోరీచేశాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో భయపడి చోరీ బంగారాన్ని పార్సిల్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తండ్రి ఆ నిందితుణ్ణి స్టేషన్‌లో అప్పగించినట్లు తెలుస్తోంది.

Similar News

News March 22, 2025

గుంటూరులో రిమాండ్ ఖైదీ పరార్..!

image

మూత్రవిసర్జన ముసుగులో రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. కొత్తపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చోరీకేసులో నిందితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఖైదీని గుంటూరు జిల్లా జైలు నుంచి తీసుకెళ్ళి తెనాలి కోర్టులో హాజరుపర్చారు. తిరుగు ప్రయాణంలో గుంటూరు బస్టాండ్‌లో మూత్రవిసర్జన కోసం వెళ్లి ఖైదీ తిరిగి రాలేదు. దీంతో ఎస్కార్ట్ పోలీసులు కొత్తపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News March 22, 2025

బ్రాడీపేటలో త్వరలో ఫుడ్ కోర్టుల ఏర్పాటు: సజీల

image

గుంటూరు నగరంలో త్వరలో మోడల్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు నగర పాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని నగర పాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ షేక్ సజీల తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవితో కలిసి బ్రాడీపేటలో పర్యటించారు. బ్రాడిపేట 4వ లైన్ 14 వ అడ్డరోడ్డులో ఫుడ్ కోర్ట్ ఉగాది లేదా శ్రీరామ నవమి నాటికిప్రారంభిస్తామన్నారు

News March 21, 2025

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ 

image

మంగళగిరి క్యాంపు కార్యాలయంలో 26 జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, MGNREGS ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై, పల్లె పండుగలో భాగంగా మొదలుపెట్టిన అభివృద్ధి పనుల స్థితిగతులపై, రేపు మొదలు పెట్టబోయే ఫాం పాండ్స్ పనులపై ఆరా తీశారు. ఈ కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ పాల్గొన్నారు. 

error: Content is protected !!