News March 20, 2025

జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

Similar News

News March 21, 2025

సిరిసిల్ల జిల్లాలో చల్లబడ్డ వాతావరణం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శుక్రవారం పలు మండలాలలో వాతావరణం చల్లబడింది. గడిచిన 24 గంటల్లోనే ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. సిరిసిల్ల 37.7°c, గంభీరావుపేట 37.5°c, ఇల్లంతకుంట 37.1°c, చందుర్తి 37.1°c, రుద్రంగి 37.2°c, తంగళ్ళపల్లి 37.1°c కొనరావుపేట 36.9°c, బోయిన్పల్లి 36.0°c, తంగళ్ళపల్లి 37.1°c, ముస్తాబాద్ 35.9°c, లుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

News March 21, 2025

నిర్మల్ జిల్లాలో సినిమా షూటింగ్

image

సప్తగిరి -ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన పెళ్లి కానీ ప్రసాద్ చిత్రం నేడు విడుదల కానుంది. కాగా, అసోసియేట్ డైరెక్టర్ సుదీర్ రెడ్డి స్వగ్రామం మామడ మండలం కమల్ కోట్ కావడంతో పలు సన్నివేశాలు కమల్ కోట్‌తో పాటు లక్ష్మణ్ చందా మండలం వడ్యాల్‌లో చిత్రీకరించారు. దీంతో నేడు సినిమా రిలీజ్ కానుండటంతో సినిమా చూసేందుకు నిర్మల్ నియోజకవర్గ వాసులు ఆసక్తి చూపుతున్నారు.

News March 21, 2025

మంత్రి ఇంట తీవ్ర విషాదం

image

AP: మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఇంట్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఇవాళ మృతి చెందారు. శనివారం ఉదయం HYDలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపట్ల సీఎంతో పాటు మంత్రులు, ముఖ్య నేతలు సంతాపం తెలిపారు.

error: Content is protected !!