News March 24, 2024

పాపన్నపేట: వన దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో తిక్కిరిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దుర్గా భవాని మాత దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో అమ్మ దర్శనానికి చాలా సమయం పట్టింది. వన దుర్గ భవాని మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Similar News

News July 8, 2024

మెదక్: రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన SI

image

మెదక్ జిల్లా హావేలిఘనపూర్ SI ఆనంద్ గౌడ్ లంచం తీసుకుంటూ చిక్కారు. సీజ్ చేసిన ఇసుక టిప్పర్ వదిలేందుకు రూ.50వేలు డిమాండ్ చేసినట్ల తెలిసింది. ఈ క్రమంలో రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అనిశా అధికారులు పోలీస్ స్టేషన్‌లో సోదాలు చేస్తున్నారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇటీవల మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడగా ఎస్ఐ, మరో కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యారు.

News July 8, 2024

సంగారెడ్డి: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

కరెంటు షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన సిర్గాపూర్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అంతర్గాంకు చెందిన సుభాష్(30) ఆదివారం చేపలు పట్టేందుకు స్థానిక వాగుకు వెళ్లాడు. ఎప్పటి లాగానే కరెంట్ షాక్ ద్వారా చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి సుభాష్ మృతి చెందాడు. ఈమేరకు మృతుడి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ మైపాల్ రెడ్డి తెలిపారు.

News July 8, 2024

పటాన్‌చెరు: ED పేరుతో.. రూ.3లక్షలు స్వాహా

image

పటాన్‌చెరు మండలం లక్డారం వాసికి జులై 1న ఓ వ్యక్తి ఈడి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మనీ లాండరింగ్ కేసు నమోదు అయ్యిందని బెదిరించాడు. విచారిస్తున్నామని ఆధార్, బ్యాంకు వివరాలు తెలపాలన్నారు. ఈ క్రమంలో ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పడంతో రూ.3 లక్షలు ఖాతా నుంచి మాయమయ్యాయి. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.