News March 20, 2025

హుజూర్‌నగర్‌లో యువతిపై అత్యాచారం

image

HNRలో యువతిపై అత్యాచారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై ముత్తయ్య తెలిపిన వివరాలిలా.. పట్టణానికి చెందిన స్వామి రోజాకు ఓ యువతితో పరిచయముంది. రోజా ద్వారా ఆమె ప్రియుడు ప్రమోద్ కుమార్ యువతికి పరిచయమయ్యాడు. ఈనెల 7న ఆ యువతిని ప్రమోద్ కుమార్ ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఫోటోలు తీశారు. తిరిగి మంగళవారం ఆ యువతిని లోబర్చుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News March 21, 2025

HZB: కాకతీయ కెనాల్ కాలువలో మృతదేహం

image

హుజూరాబాద్ మండలం తుమ్మపల్లి కాకతీయ కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. స్థానికుల గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 21, 2025

ఓటీటీలోకి వచ్చేసిన రెండు సినిమాలు

image

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’, జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్, అనుపమ, కయాదు లోహర్ నటించిన ‘డ్రాగన్’ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక ధనుశ్ దర్శకుడిగా తెరకెక్కించిన జాబిలమ్మ నీకు అంత కోపమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు చిత్రాలు థియేటర్లలో హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

News March 21, 2025

BIG BREAKING: మంత్రి ఫరూక్ సతీమణి మృతి

image

న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని వారి ఇంట్లోనే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి ఇవాళ మృతి చెందారు.

error: Content is protected !!