News March 20, 2025

హైదరాబాద్‌లో OYO 2.O!

image

HYDలో OYOకు డిమాండ్‌ పెరిగింది. ఇటీవల సర్వేలోనూ నిజమని తేలింది. పాతబస్తీ గల్లీల నుంచి ORR వరకు ఓయోలే దర్శనమిస్తున్నాయి. చిన్న.. చిన్న లాడ్జీలను సైతం ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. రూ.500కే గదులను అద్దెకు ఇవ్వడంతో జనం క్యూ కడుతున్నారు. హోటళ్లు, గదులను లగ్జరీగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చిల్ అవ్వాలని యువతను ఆకర్శిస్తున్నారు. దీంతో HYDలో OYO కొత్తపుంతలు తొక్కుతోంది.

Similar News

News September 18, 2025

HYD: డబ్బు ఊరికే రాదుగా.. జాగ్రత్తలు చెప్పండి!

image

ఇంట్లోని వృద్ధుల స్మార్ట్ ఫోన్లను గమనిస్తూ ఉండండి. మీరు దగ్గర లేకపోతే జాగ్రత్తలు చెబుతూ ఉండండి. ఇటీవల సైబర్ నేరస్థులు వృద్ధులను టార్గెట్ చేస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల బషీర్‌బాగ్‌లో ఓ రిటైర్డ్ లేడీ అధికారి సైబర్ నేరస్థుల బారిన పడి గుండెపోటుతో మృతి చెందారు. అందుకే అన్‌వాంటెడ్ కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తొద్దని, పలు జాగ్రత్తలు చెప్పండి.

News September 18, 2025

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. సిలబస్ భారం తగ్గింపు !

image

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొండలా ఉన్న సిలబస్ తగ్గించనుంది. గత 5ఏళ్లుగా నీట్, జేఈఈ, ఎప్సెట్ తదితర ప్రశ్నాపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఏఏ భాగం నుంచి ప్రశ్నలు రాలేదో గమనించి ఆ సిలబస్‌ను తొలగించనున్నారు. అయితే ఈ మార్పులు వచ్చే విద్య సంవత్సరం (2026-27)నుంచి అమలు చేయాలని ఆలోచిస్తోందని సమాచారం. ఇదే జరిగితే ఇక స్టూడెంట్స్ హ్యపీయే కదా!

News September 18, 2025

మాదాపూర్ శిల్పారామంలో రేపటినుంచి సందడి

image

కళాకృతులు, చేనేత వస్త్రాలు, అరుదైన వంటకాలు.. ఇవన్నీ మాదాపూర్ శిల్పారామంలో రేపటినుంచి కొలువుదీరనున్నాయి. 10 రోజుల పాటు నగర ప్రజలను ఆకట్టుకోనున్నాయి. పల్లె గొప్పదనం చెప్పేలా.. పల్లె రుచులు తెలుసుకొనేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శిల్పారామంలో సరస్ మేళా రేపు ప్రారంభం కానుంది. 29వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.