News March 20, 2025

సూర్యాపేట జిల్లాలో యువతిపై అత్యాచారం

image

HNRలో యువతిపై అత్యాచారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SI ముత్తయ్య తెలిపిన వివరాలిలా.. పట్టణానికి చెందిన స్వామిరోజాకు ఓ యువతితో పరిచయముంది. రోజా ద్వారా ఆమె ప్రియుడు ప్రమోద్‌కుమార్ యువతికి పరిచయమయ్యాడు. ఈనెల 7న ఆ యువతిని ప్రమోద్ కుమార్ ఓ లాడ్జికి తీసుకెళ్లి మద్యం తాపి అత్యాచారం చేసి ఫోటోలు తీశారు. తిరిగి మంగళవారం ఆ యువతిని లోబర్చుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News March 21, 2025

లాంగెస్ట్ రోడ్ నెట్‌వర్క్‌లో నల్గొండ స్థానం ఇది..!

image

రాష్ట్రంలో అత్యధిక దూరం రోడ్ నెట్‌వర్క్ కలిగిన జిల్లాల్లో నల్గొండ రెండో స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,775.56 కిలోమీటర్ల రోడ్ కనెక్టవిటీ ఉండగా.. రంగారెడ్డిలో 7,932.14 కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్ ఉంది. నల్గొండలో 7,766.92 కిలోమీటర్లు రోడ్డు కనెక్టవిటీ ఉంది. కాగా, కీలకమైన రోడ్డు డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్లో నల్గొండను ఒకటిగా ఎంచుకున్నారు.

News March 21, 2025

నల్గొండ ఫస్ట్.. సూర్యాపేటకు ఫోర్త్ ప్లేస్..!

image

రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా నల్గొండలోనే అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2,37,664 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో NLG మొదటి స్థానంలో ఉండగా.. 1,54,224 కనెక్షన్లతో సూర్యాపేట నాల్గో స్థానంలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,17,477 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్ల పరంగా చూస్తే.. నల్గొండ ఐదో స్థానంలో నిలిచింది.

News March 21, 2025

నల్గొండ: మూల్యాంకనం తేదీలో మార్పు..!

image

ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సివిక్స్ పరీక్షలకు సంబంధించి ఈనెల 22న జరగాల్సిన మూల్యాంకనం 21వ తేదీ (శుక్రవారం)కి మార్చినట్లు డీఐఈఓ దస్రూ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జామినర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

error: Content is protected !!